- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరు మార్చి నష్టపోయాం.. మళ్లీ టీఆర్ఎస్‌గానే ఉండాలనుకుంటున్నాం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన, నూతన మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, గత నిర్ణయాలపై ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరును బీఆర్ఎస్‌గా మార్చడంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి మనం రాజకీయంగా చాలా నష్టపోయాం. ప్రజల్లో బలంగా నాటుకుపోయిన గులాబీ జెండా, టీఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంట్ విడదీయలేనిది. మళ్లీ పార్టీని టీఆర్ఎస్ (TRS) గానే చూడాలని, పాత పేరుతోనే ముందుకు సాగాలని అనుకుంటున్నాం." అని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై పార్టీ అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు సంకేతాలిచ్చారు.
రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధం..
వచ్చే రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని విమర్శిస్తూ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతాను. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ బలోపేతం చేయడమే మా లక్ష్యం అని కేటీఆర్ ప్రకటించారు. అంతకుముందు, నూతన మున్సిపాలిటీ పాలకవర్గాన్ని కేటీఆర్ సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.






