- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: త్వరలో తిరిగి అధికారంలోకి కేసీఆర్ ప్రభుత్వం
అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి.. ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి.. ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్‌లో బొబ్బా నవతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పురస్కారాల ప్రదానోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రమే అసలైన గౌరవం ఇస్తుందని అన్నారు. ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా, సొంతంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయన్నారు.
రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో, చదువుకున్న విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, భవిష్యత్తులోనూ మహిళా సంక్షేమం కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. మరోసారి రాష్ట్రంలోని మహిళల ఆశీస్సులతో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన సోషల్ వర్కర్స్, ఆర్టిస్టులు, జర్నలిస్టులు, శానిటేషన్ వర్కర్లు, ప్రజాప్రతినిధులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, నాయకులు నరేందర్, పాండురంగారెడ్డి, బొబ్బా నవతారెడ్డి పాల్గొన్నారు.






