నేను కాదు.. ఆ ఇద్దరే ఐరన్ లెగ్‌లు: కేటీఆర్

by Gantepaka Srikanth |

నేను కాదు.. ఆ ఇద్దరే ఐరన్ లెగ్‌లు: కేటీఆర్

నేను కాదు.. ఆ ఇద్దరే ఐరన్ లెగ్‌లు: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు కానీ.. నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటానని హెచ్చరించారు. రేవంత్ ఇంట్లో మహిళలను, పిల్లలను, మనమడి గురించి నేను మాట్లాడను.. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో నేను చిల్లర రాజకీయాలు చేయనని అన్నారు. కేసీఆర్ రేపు అన్ని విషయాలపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు.. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ ఉంటుందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సర్కార్‌కు హనీమూన్ ముగిసింది. ‌ఇక కేసీఆర్(KCR) ప్రజల్లోకి వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ బహిరంగ సభలపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెండ్‌గా నేను ఫెయిల్ కాదు.. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీలు గెలిచామని తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికలు వస్తే అన్ని స్థానాల్లో ఓడిపోయారని గుర్తుచేశారు. రేవంత్ సీఎం అయ్యాక.. సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేదని ఎద్దేవా చేశారు. నేకు ఐరన్ లెగ్ కాదు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ఐరన్ లెగ్ అని విమర్శించారు. ఢిల్లీలో రేవంత్ విందులు, వినోదాలు ఎవరి ఇళ్ళల్లో జరుగుతున్నాయో తెలుసు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు రీమోడల్ చేయించిందే బీజేపీ ఎంపీ.. అందుకే సీఎం రమేష్‌కు రేవంత్ కాంట్రాక్టులు ఇస్తున్నారని అన్నారు.

Next Story