- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావమరిదిని కాపాడారని.. బీజేపీ ఎంపీకి CM రేవంత్ భారీ కాంట్రాక్టు: KTR సంచలన ఆరోపణ
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను కాదని.. బీజేపీ, కాంగ్రెస్‌లకు తెలంగాణ ప్రజలు చెరో ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు. ఇన్ని నెలులుగా 16 మంది ఎంపీలు రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా పనిచేస్తున్నదని అన్నారు. రేవంత్ ప్రతీ తప్పును బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారని చెప్పారు. కేంద్రంలో రేవంత్ రెడ్డి బావమరిదిని బీజేపీ కాపాడితే.. తెలంగాణలో బీజేపీ ఎంపీకి రేవంత్ భారీ రోడ్డు కాంట్రాక్టు ఇచ్చాడని ఆరోపించారు. మోడీ, రేవంత్ ఇద్దరూ ఒక్కటే అని.. ఒకరు బడే భాయ్, మరొకరు ఛోటే భాయ్ అని విమర్శించారు. మధ్యలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆటలో అరటిపండు అయ్యాడని అన్నారు. భవిష్యత్‌లో రాహుల్‌కు రేవంత్ నుంచి ముప్పు ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారి మీదకు మోడీ ఈడీని పంపితే.. రేవంత్ సీబీఐని పంపుతున్నాడని అన్నారు.
మరోవైపు రాష్ట్రంలో రైతులు అరిగోస తీస్తున్నారని గుర్తుచేశారు. యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారని చెప్పారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడుతున్నారని అన్నారు. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దని బీజేపీ నేతలు అంటున్నారు. కిందనున్న ఆంధ్రా, తమిళనాడుకు గోదావరి నీళ్లు ఇస్తారట అని ఎద్దేవా చేశారు.






