- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక వదిలిపెట్టేది లేదు.. అసెంబ్లీ నుంచి మండలి దాకా అన్నీ స్తంభింపజేస్తాం: కేటీఆర్
ఇక వదిలిపెట్టేది లేదు.. అసెంబ్లీ నుంచి మండలి దాకా అన్నీ స్తంభింపజేస్తాం: కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్ వేదికగా కార్మిక సంఘాలతో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారు, అలాగే అత్యంత పేదరికం ఉంది. 'ప్రపంచమే కుగ్రామం' అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లలో భాగంగా కొత్త సంస్కరణలు తెస్తున్నారు. సామాజిక స్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాతాం అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కేసీఆర్ పేదవారి సంక్షేమాన్ని ఎన్నడూ విస్మరించకుండా మానవీయ కోణంలో ఆలోచించారు. సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు పదేళ్లలో రూ. 3500 కోట్ల మేర బతుకమ్మ చీరల తయారీకి కేసీఆర్ ఆర్డర్ ఇచ్చారు. కొందరు పిచ్చోళ్లు తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ చలించిపోయి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేశారని గుర్తుచేశారు.
కనీసం పాలకుల్లో చలనం వస్తుందని కేసీఆర్ ఆనాడు పార్టీ తరఫున సాయం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పరంగా సాయం చేశారు. నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేది. ఇప్పుడు మనది నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే, చైనాది అరవై ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. చైనా ఎప్పటికప్పుడు ప్రజలకు అనుగుణంగా నూతన విధానాలు తీసుకు రాబట్టే ఫలితాలు సాధించింది. అలాంటి వాటిపై ఈ దేశంలో చర్చ జరగదు. అన్నింటికీ మందు పోరాడే పార్టీకి పార్లమెంట్‌లో తగిన సీట్లు ఇవ్వడమే. లోక్‌సభలో బీఆర్‌ఎస్(BRS)కు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఇలాంటి చట్టాలను తెస్తున్నాయి. మోనోపలీ (ఏకాధిపత్యం) వల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందో, ఇండిగో విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ. ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయని అన్నారు.
శ్రమదోపిడీ వల్లే ఇదంతా జరిగింది. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదు. కేంద్రం ఐదు రోజుల తర్వాత స్పందించడం వల్ల ఎయిర్‌పోర్టులు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లుగా మారాయి. కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకు విస్తరిస్తుంది. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఏ కార్మిక సంఘంతో కలిసి బీఆర్‌టీయూ (BRTU) పనిచేసినా అభ్యంతరం లేదు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, బీఆర్‌టీయూ ఎవరితోనైనా పని చేయొచ్చు. లేబర్ కోడ్‌లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకుంటే దేశానికి దిక్సూచి అవుతుంది. సోనియా గాంధీ ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక్కడి నుంచే పోరాటాన్ని మొదలుపెడదాం. ఢిల్లీలో కేంద్ర కార్మిక మంత్రిని, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులను కలుద్దాం. లేబర్ కోడ్‌ల అమలు ఆపేదాకా అసెంబ్లీ, మండలి సమావేశాలు స్తంభింపజేస్తాం. వరంగల్‌లో తదుపరి రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామని కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.






