- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ CM అయ్యాక పత్తి రైతు చిత్తు: కేటీఆర్
రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి రాబంధు పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బోథ్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సమావేశం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి రాబంధు పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బోథ్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక మంది రైతాంగం పండించే పత్తి పంట కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకుండాపోయిందన్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చాక పత్తి రైతు చిత్తయిపోయాడని.. సోయా రైతులను పట్టించుకునే వాళ్లు లేరని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం కొన్ని వేల ఓట్లతో ఆదిలాబాద్, ఖానాపూర్, కాగజ్‌నగర్ వంటి నియోజకవర్గాలు కోల్పోయామని.. చిన్నచిన్న పొరపాట్లతో ఈ సీట్లని కోల్పోయాము కానీ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకే అండగా నిలిచారని చెప్పారు.
మరో రెండేళ్ల తర్వాత కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎమ్మెల్యే అనిల్ యాదవ్ డబ్బులు ధర్పం లేకున్నా మంచి మనసున్న నాయకుడని కొనియాడారు. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన ఉన్నదని చెప్పారు. తెలంగాణతోపాటు ఆదిలాబాద్ జిల్లాకు తీవ్రంగా నష్టం చేస్తున్న బీజేపీకి కాంగ్రెస్ మద్దతు పలుకుతున్నదని ఆరోపించారు. రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పంచాయతీరాజ్ ఎన్నికల స్ఫూర్తితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లోనూ మంచి విజయం సాధించాలన్నారు. గ్రామాలకు వచ్చే నిధులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే మెహర్బానీ కాదని.. అది రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు గ్రామ సర్పంచులకు దక్కిన హక్కు అని తెలిపారు.






