- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేషనల్ అవార్డు విన్నర్ కాసర్ల శ్యామ్‌కు KTR విషెస్
by Gantepaka Srikanth |
బలగం సినిమా(Balagam Movie)లో "ఊరు పల్లెటూరు" పాటకి గాను బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో పాటల రచయిత కాసర్ల శ్యామ్(Kasarla Shyam)కు నేషనల్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: బలగం సినిమా(Balagam Movie)లో "ఊరు పల్లెటూరు" పాటకి గాను బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో పాటల రచయిత కాసర్ల శ్యామ్(Kasarla Shyam)కు నేషనల్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. తాజాగా పాటల రచయిత కాసర్ల శ్యామ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అభినందనలు తెలిపారు. బలగం సినిమాకు నేషనల్ అవార్డు రావడం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం అని అన్నారు. బలగం సినిమాతో దూరమవుతున్న మానవ సంబంధాలను తట్టిలేపారని ప్రశంసించారు. ఎందరో ప్రముఖుల తర్వాత ‘ఊరు పల్లెటూరు’ పాట రాసిన తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నానని కాసర్ల శ్యామ్ అన్నారు. వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ఈ బలగం చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Next Story






