- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: రెండున్నరేళ్లలో వస్తాం.. అధికారుల హిసాబ్ కితాబ్ సెటిల్ చేస్తాం : కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా.. కాంగ్రెస్ నాయకుల్లా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Local body elections) స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటిస్తామని.. కాంగ్రెస్ చెప్పే 42 శాతం కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హామీ ఇచ్చారు. గురువారం తెలంగాణ భవన్‌లో పరిగి నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఏం సాధించారని నిలదీశారు. రాహుల్ ప్రధాని అయితేనే బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పారా? అని సెటైర్లు వేశారు. చేతిలో ఉన్న బీసీ సబ్‌ప్లాన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ అయ్యాక రైతుబంధు కచ్చితంగా ఎత్తేస్తారని ఆరోపించారు. కేబినెట్‌లో చర్చించారు.. ఎన్నికల తర్వాత తీసివేయాలని నిర్ణయించారని వివరించారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు రాం రాం అయితదని కేసీఆర్ ఆనాడే చెప్పాడని గుర్తుకుచేశారు.
తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది
బీజేపీలో బీఆర్ఎస్ (BRS) విలీన మంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అసలు బీజేపీలోకి విలీనం కావాల్సిన అవసరం బీఆర్ఎస్‌కు ఏముందని ప్రశ్నించారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని అన్నారు. బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం.. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పారు.
తెలంగాణ పోలీసులు, అధికారులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
హోం మంత్రిగా పని చేసిన సబితమ్మపై.. పోలీసులు రెచ్చిపోయరాని కేటీఆర్ మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా.. కాంగ్రెస్ నాయకుల్లా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మరో మూడేళ్లలో మేము వస్తాం.. అప్పుడు అతి చేసిన అధికారుల హిసాబ్ కితాబ్ సెటిల్ చేస్తాం.. అని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.






