- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్‌తో దాడి ఘటనలో బాధితులను పరామర్శించిన కేటీఆర్
సర్పంచ్ ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సోమార్‌పేట గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి , అతని కుటుంబ సభ్యులు, అనుచరులపై ప్రత్యర్థి తమ్ముడు ట్రాక్టర్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : సర్పంచ్ ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సోమార్‌పేట గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి , అతని కుటుంబ సభ్యులు, అనుచరులపై ప్రత్యర్థి తమ్ముడు ట్రాక్టర్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో బాధితులను నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. దైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగా ఈ ఘటనలో బీఆర్ఎస్ అభ్యర్థిని, అతని అనుచరులను, కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య సోదరుడు ట్రాక్టర్‌తో ఢీకొట్టించగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
తమకు వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయొద్దని.. రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామని.. తమను ఎవరూ ఏం లేయలేరని నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డట్టు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ అధికారులను కోరారు.






