- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ MP మందా జగన్నాథం కుటుంబ సభ్యులను పరామర్శించిన KTR
అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మందా జగన్నాథం(Manda Jagannadham) పార్థివ దేహాన్ని సందర్శించి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) నివాళులర్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మందా జగన్నాథం(Manda Jagannadham) పార్థివ దేహాన్ని సందర్శించి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా, నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన జగన్నాథం నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 1996, 1999, 2004, 2009లో ఎంపీగా విజయం సాధించారు. 3 సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ తరఫున గెలిచారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరారు.
అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మంద జగన్నాథం పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, ఇతర నాయకులు.
— BRS Party (@BRSparty) January 13, 2025
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. జగన్నాథం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.… pic.twitter.com/3Mjb3L7Q04






