Flash News: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్.. కేసీఆర్‌తో వాటిపై చర్చ?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-25 09:30:39  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటికి రావడంతో.. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలు గుప్పుమన్న వేళ కేటీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లారు.

Flash News: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్.. కేసీఆర్‌తో వాటిపై చర్చ?
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటికి రావడంతో.. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలు గుప్పుమన్న వేళ కేటీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్‌తో సమావేశమై.. కవిత రాసిన లేఖ, కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన నోటీసుల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఇటీవలే కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కు నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కవిత తన తండ్రికి ఎల్కతుర్తి సభ అనంతరం రాసిన లేఖ బయటికి వచ్చింది. అందులో సభలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ అంశాలను ప్రస్తావిస్తూనే బీజేపీ విషయంలో చేస్తున్న తప్పులు, ఆయన చుట్టూ దెయ్యాలున్నారనడం చర్చకు దారితీశాయి. అంతకుముందు హరీష్ రావు పార్టీ వీడే ఆలోచనలో ఉండగా.. కేటీఆర్ సర్దిచెప్పారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో పార్టీ పగ్గాల కోసం ఇంటి పోటీ నెలకొందని, కేటీఆర్, కవిత, హరీష్ రావులు అధికారం కోసం పోటీ పడుతున్నారని ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కేటీఆర్.. కేసీఆర్ తో సమావేశమయ్యేందుకు ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లడంతో ఈ అంశాలపై చర్చించి, సమస్యల్ని పరిష్కరించేలా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Next Story