KTR: దరఖాస్తుల దందా నడవదు.. ఆగ్రహ జ్వాల ఇక ఆగదు: కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-22 12:59:22  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో పెల్లుబికిన ప్రజాగ్రహంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి ‘X’ (ట్విట్టర్) వేదికగా ఫైర్ అయ్యారు.

KTR: దరఖాస్తుల దందా నడవదు.. ఆగ్రహ జ్వాల ఇక ఆగదు: కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో పెల్లుబికిన ప్రజాగ్రహంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి ‘X’ (ట్విట్టర్) వేదికగా ఫైర్ అయ్యారు. మోసకారి కాంగ్రెస్ సర్కార్‌ (Congress Government)పై ప్రజల తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఆరు గ్యారంటీ (Six Guarantees)ల గారడీపై జన గర్జన షురువైందని కామెంట్ చేశారు. అసమర్థ ముఖ్యమంత్రి (Chief Minister), అసలు రూపం బట్టబయలైందని.. ఇక కాలయాపనతో కాలం సాగదని అన్నారు.

అటెన్షన్ డైవర్షన్‌ (Attention Diversion)తో ప్రజల కట్టలు తెంచుకున్న కోపాన్ని నిలువరించలేరని తెలిపారు. గ్రామాల్లో దరఖాస్తు దందా నడవదని.. ఆగ్రహ జ్వాల ఆగదని ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ (Adilabad) నుంచి అలంపూర్ (Alampur) వరకు అట్టుడికిన గ్రామ సభల సాక్షిగా.. అవి గ్రామ సభలా.. ఖాకీల క్యాంపులా అని మండిపడ్డారు. గ్రామ సభలు సంక్షేమ పథకాల కోసమా.. కాంగ్రెస్ (Congress) కార్యకర్తల నిర్ధారణ కోసమా అని ప్రశ్నించారు. ఖాకీల దౌర్జన్యాలు, ‘హస్తం’ నేతల బెదిరింపులతో సభలు నిర్వహించడం ఏంటని ధ్వజమెత్తారు. మీరు చెప్పిన ప్రజా పాలనా ఇదా.. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా ఇదేనా అని ఫైర్ అయ్యారు. పోలీసులు, అంక్షల నడుమ పథకాలకు అర్హుల గుర్తింపట..! నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు కాంగ్రెస్ పాలన.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story