బీఆర్ఎస్ కార్యకర్తలకు KTR కృతజ్ఞతలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-11 15:04:54  IST  )

బీఆర్ఎస్ కార్యకర్తలకు KTR కృతజ్ఞతలు

బీఆర్ఎస్ కార్యకర్తలకు KTR కృతజ్ఞతలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు పేరుపేరున కృతజ్ఞతలు.. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయబ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో ఉపఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story