ఉప్పల మల్లయ్య కుటుంబానికి అండగా కేటీఆర్: ₹5 లక్షల ఆర్థిక సహాయం

by Malleboina Mahesh |

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, నూతనకల్ మండలం, లింగంపల్లి గ్రామంలో దారుణ సంఘటనలో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే.

ఉప్పల మల్లయ్య కుటుంబానికి అండగా కేటీఆర్: ₹5 లక్షల ఆర్థిక సహాయం
X

దిశ, వెబ్ డెస్క్: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, నూతనకల్ మండలం, లింగంపల్లి గ్రామంలో దారుణ సంఘటనలో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన తర్వాత మల్లయ్య కుటుంబాన్ని ఈ రోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మల్లయ్యను కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్య చేయబడినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, కేటీఆర్ ఆ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా, మల్లయ్య కుటుంబానికి ₹5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని, పార్టీ తరఫున అన్ని వేళలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ దారుణ చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, అధికార మార్పుల సమయంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులకు పాల్పడటం అన్యాయమని అన్నారు. మల్లయ్య మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్న కేటీఆర్, ఈ హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఈ కష్టకాలంలో పార్టీ యావత్తు మల్లయ్య కుటుంబానికి తోడుగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఈ సమయంలో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఉన్నారు.

Next Story