పీజేఆర్ కుటుంబంపై బీఆర్ఎస్ పోటీకి కారణం అదే.. వివరణ ఇచ్చిన కేటీఆర్

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్​ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారం వేడెక్కింది.

పీజేఆర్ కుటుంబంపై బీఆర్ఎస్ పోటీకి కారణం అదే.. వివరణ ఇచ్చిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్​ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS)​పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు కేటీఆర్, ఇంకోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ వైఫల్యాలు చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు, మాకూ ఒక అవకాశం ఇవ్వండంటూ బీజేపీ నేతలు ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు.

అయితే శనివారం నాటి జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీజేఆర్ మరణానంతరం.. ఆయన గౌరవార్థం ఎన్నిక ఏకగ్రీవం చేయాలని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నిర్ణయిస్తే బీఆర్ఎస్ మాత్రం పోటీలో అభ్యర్థిని పెట్టిందని మండిపడ్డారు. పీజేఆర్ కుటుంబంపై పోటీకి అభ్యర్థిని నిలబెట్టి దుష్ట సంప్రదాయాన్ని బీఆర్ఎస్ తీసుకొచ్చిందని సీరియస్ అయ్యారు.

తాజాగా.. పీజేఆర్ కుటుంబంపై పోటీగా అభ్యర్థిని నిలబెట్టడంపై కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘‘కుటుంబం గురించి కుటుంబ విలువల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది.. PJR మీద రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రేమ పొంగుకొచ్చింది.. కానీ 2023 ఎన్నికల్లో PJR కొడుకు విష్ణువర్ధన్‌కు ఎందుకు టికెట్ ఇవ్వలేదు.. కంటోన్మెంట్ ఎన్నికల్లో గద్దరన్న కూతురికి ఎందుకు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన మామ జైపాల్ రెడ్డిని బూతులు తిట్టాడు.. ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నాడు.. రేవంత్ రెడ్డిలాగా అవకాశవాడ రాజకీయాలు చేయడం మాకు రాదు. మా పార్టీ సభ్యులు అందరినీ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాం. మా సిద్ధాంతాలు, మా విధానాలు మాకు ఉంటాయి’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. వీడియో

Next Story