KTR: కోటి అబద్ధాల రేవంత్ .. ఆడ బిడ్డలను కోటిశ్వరులను చేస్తావా?.. కేటీఆర్ సంచలన ట్వీట్

by Kema Shiva Kumar |

రాబోయే పదేళ్లలో ఆర్టీసీ (RTC), సోలార్ విద్యుత్ కేంద్రాలు (Solar Power Plants), ఐకేపీ సెంటర్లు (IKP Centers) తదితర అన్ని రంగాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని బుధవారం పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు.

KTR: కోటి అబద్ధాల రేవంత్ .. ఆడ బిడ్డలను కోటిశ్వరులను చేస్తావా?.. కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే పదేళ్లలో ఆర్టీసీ (RTC), సోలార్ విద్యుత్ కేంద్రాలు (Solar Power Plants), ఐకేపీ సెంటర్లు (IKP Centers) తదితర అన్ని రంగాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని బుధవారం పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈ క్రమంలోనే సీఎం స్టేట్‌మెంట్‌పై తాజాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ట్వీట్ చేశారు. కోటి అబద్ధాల రేవంత్.. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తావా అని ప్రశ్నించారు.

అద్దుమరాత్రి ఆడబిడ్డ ఒంటిపై లాఠీ ఝళిపించిన సీఎంను ప్రజలకు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ‘హైడ్రా’ (HYDRA)తో బుచ్చమ్మను పొట్టన పెట్టుకున్నారని.. మూసీలో ఆడబిడ్డల ఆశల గూడును నేలమట్టం చేస్తున్నారని మండిపడ్డారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కానుకలకు కత్తెర పెట్టారని ఆక్షేపించారు. నిండు గర్భిణీల న్యూట్రీషన్ కిట్‌ (Nutrition kit)ను కూడా మాయం చేశారని ఫైర్ అయ్యారు. పేదింటి మహిళల కోసం కేసీఆర్ (KCR) తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ (KCR Kit) , అమ్మ ఒడిని కాంగ్రెస్ సర్కార్ ఎత్తేసిందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా తులం బంగారం పేరుతో ఆడబిడ్డల వంచించారని అన్నారు.

రాష్ట్రంలో పత్రి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామంటూ చెవిలో పువ్వులు పెట్టారని అన్నారు. పింఛన్లను రూ.4 వేలను పెంచుతామని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని తెలిపారు. బతుకమ్మ చీరలను బందువెట్టిన నువ్వు.. మహిళలను కోటీశ్వరులను చేస్తావా అని కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. ‘నీ డమ్మీ పథకాలు గడపలు దాటవు కానీ.. నీ మాటలు కోటలు దాటుతున్నాయి. కోటి రతనాల వీణ తెలంగాణ (Telangana) భవిష్యత్తు ఏడాది పాలనతో ప్రశ్నార్థకం చేశావు. పదేళ్ల కేసీఆర్ (KCR) పాలనతో భరోసా నిండిన బతుకుల్లో భయం నింపావు. సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టావు. బతుకమ్మ నెత్తిన చేతులే నీ భరతం పడతాయి.. జై తెలంగాణ అంటూ కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.

Next Story