- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ బాధ్యత మనమీదే ఉంది’: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ కీలక పిలుపు
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య(Daasarathi Krishnamacharyulu) శతజయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సర్మించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య(Daasarathi Krishnamacharyulu) శతజయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సర్మించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. కవిగా, రచయితగా తన రచనలతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన దాశరథి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం సాగించి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్యులు. రుద్రవీణ, అగ్నిధార, కవితాపుష్యకం, పునర్నవం, అమృతాభిషేకం, తిమిరంలో సమరం లాంటి సంకలనాలు, అద్భుత కావ్యాలు రచించిన దాశరథి తన కలంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. పీడిత ప్రజల గొంతుకగా జీవించిన దాశరథి తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం. అంతటి మహాకవిని బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం సముచితంగా గౌరవించింది.. వారి పేరిట సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. వారి జయంతిని (జూలై 22) అధికారికంగా నిర్వహించింది. ఆ మహనీయుడి రచనలను, వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉంది’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.






