- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR : బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తమ పార్టీకి కొత్త అర్థాన్ని వివరించారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తమ పార్టీకి కొత్త అర్థాన్ని వివరించారు. బీఆర్ఎస్(BRS) అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని, భారత రైతు సమితి కూడా అని పేర్కొన్నారు. బుధవారం అన్నదాతల బలవన్మరణాలు, సాగు సంక్షోభంపై ఏర్పాటైన బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ(BRS Farmer Study Committee) సమావేశం అయింది. అధ్యయన కమిటీ చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలియజేశారు. పంటలకు మద్ధతు ధర, రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్ మాటలు నమ్మి వారిని గెలిపిస్తే.. ఇపుడు వారిని పట్టించుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రయారిటీ ఫార్ములా రేస్(Formula Race) అయితే తమ ప్రయారిటీ ఫార్మర్స్(Farmers) అన్నారు. రాష్ట్రంలో రైతులు బాగుండాలనేదే బీఆర్ఎస్ ఉద్దేశం అని.. ఎద్దు ఏడ్చినా వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. ఆ కన్నీళ్ళు తుడవటానికి తాము రాష్ట్రమంతా నెలరోజుల పాటు పర్యటనలు చేసి.. రైతుల గోడు వింటామని తెలిపారు. బీఆర్ఎస్ అధ్యయన కమిటీ ఈనెల 24 నుంచి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి పర్యటన మొదలు పెట్టి ఫిబ్రవరి చివరి వారం దాకా.. రైతు రుణమాఫీ ఎంతవరకు జరిగింది, పంటలకు కరెంట్ సరఫరా ఎలా ఉంది, పంట మద్ధతు ధర ఇస్తున్నార లేదా, రైతుల ఆత్మహత్యలు వంటి విషయాలను అధ్యయనం చేసి.. తమ అధినేత కేసీఆర్ కు నివేదిక అందజేస్తామని కేటీఆర్ వెల్లడించారు.






