- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: హరీష్ రావుతో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకు ముందు ఆసక్తికర పరిణామం
by Prasad Jukanti |
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకు ముందు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission) ముందు ఇవాళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ (Harish Rao) హాజరయ్యారు. కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు ముందు ఆయన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం కోకాపేటలోని తన నివాసం వద్ద నుంచి హరీశ్ రావు తెలంగాణ భవన్ చేరుకున్నారు. అక్కడ కేటీఆర్ తో (KTR) పాటు పార్టీ ముఖ్య నాయకులతో కాసేపు సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు బీఆర్కే భవన్ కు బయలుదేరారు. ఈ సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. హరీశ్ రావు వెంట మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు ర్యాలీగా భయలుదేరారు.
Next Story






