'కాంగ్రెస్ అరాచకాలను ఉపేక్షించం' తుంగతుర్తి ఘటనపై కేటీఆర్ ఆగ్రహం

by Malleboina Mahesh |

తొలి విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతల మధ్య దాడులు జరిగాయి.

కాంగ్రెస్ అరాచకాలను ఉపేక్షించం తుంగతుర్తి ఘటనపై కేటీఆర్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: తొలి విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య (Uppula mallayya) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురికి గాయాలు కాగా పోలీసులు రంగంలోకి దిగి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లింగంపల్లిలో బీఆర్ఎస్ నేతలపై దాడులను ఎక్స్ వేదికగా ఖండించిన ఆయన 'కాంగ్రెస్ అరాచకాలను ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌లతో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

"అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు సాగిస్తున్న అరాచకాలను బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక, భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం" అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. "కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు, వారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది" అని హామీ ఇచ్చారు. మరణించిన కార్యకర్త కుటుంబానికి, అలాగే ఈ దాడిలో గాయపడిన వారికి పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు.

Next Story