- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR : రేవంత్ రెడ్డికి కర్రుకాల్చి వాత పెట్టే రోజు వస్తోంది : కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లోకి నేడు మెదక్ జిల్లా(Medak District) కాంగ్రెస్ పార్టీ నేత మైనంపల్లి శ్రేణులు భారీగా చేరారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లోకి నేడు మెదక్ జిల్లా(Medak District) కాంగ్రెస్ పార్టీ నేత మైనంపల్లి శ్రేణులు భారీగా చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వారికి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేటలో పందులను తమ శ్రేణులు తరిమేశారని, మెదక్ లో కొన్ని గాడిదలు మిగిలాయని వాటి సంగతి కూడా మీరే చూడాలని అన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కర్రుకాల్చి వాత పెట్టేది బీఆర్ఎస్ కార్యకర్తలేనని తెలిపారు. ఆయన గురించి చెప్పాలి అంటే.. ఊర్లల్లో జనం ముందు మైకులు పెడితే ఆయన గురించి బాగా తెలుస్తోందని, ప్రజలే రేవంత్ ఏంటో చెబుతున్నారని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తిని ఈయననే చూస్తున్నామని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాక నాలుగు భూతులు మాట్లాడి 100 సీట్లు వస్తాయని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 100 కాదు ప్రజలు తరిమివేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేయకుండా, తెలంగాణ ప్రజలను అవమానించకుండా ఉంటే మంచిదని హితవు పలికారు. మరో మూడున్నారేళ్లు అధికారం ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలోకి అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చి చేరడం అంటే కాంగ్రెస్ మీద ఎంత విరక్తి వచ్చిందో తెలుస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.






