కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్తారు: KCR

by Gantepaka Srikanth |

కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్తారు: KCR

కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్తారు: KCR
X

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Ranga Reddy Project) విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన పాలమూరు జిల్లాను.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సస్యశ్యామలం చేశామని అన్నారు. ఇప్పుడు మళ్లీ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి పాలమూరు జిల్లా ప్రజలను గోస పెడుతున్నాయని మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఇదే అంశంపై త్వరలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ఢిల్లీకి వెళ్తారని.. ఢిల్లీ స్థాయిలో కేంద్రం కుట్రలపై, జలదోపిడీపై న్యాయ పోరాటం చేస్తారని అన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కష్టపడిన వారికి అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని పేర్కొన్నారు. అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు. పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.

Next Story