మెడిసిన్లో సీట్లు సాధించిన విద్యార్థులను సన్మానించిన కేటీఆర్

by Muthe.Rajitha |

వైద్యవిద్యలో సీట్లు పొందిన మైనార్టీ విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆదివారం తెలంగాణ భవన్ లో సన్మానించారు.

మెడిసిన్లో సీట్లు సాధించిన విద్యార్థులను సన్మానించిన కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : వైద్యవిద్యలో సీట్లు పొందిన మైనార్టీ విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆదివారం తెలంగాణ భవన్ లో సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేసీఆర్‌ తెలంగాణలో 204 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,022 గురుకులాలను కేసీఆర్‌ ఏర్పాటు చేశారని, నేడు వాటి నుంచి ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లుగా తయారవుతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో 34 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని, కేవలం జహీరాబాద్‌ నుంచే 16 మంది ఎంబీబీఎస్‌ సీట్లు సాధించడం గర్వంగా ఉందని తెలిపారు. మైనార్టీ గురుకులాల్లో ఫలితాలు ఎంతో గొప్పగా ఉన్నాయనడానికి ఈ 16 మంది విద్యార్థులే నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. కాగా విద్యార్థులను సన్మానించే కార్యక్రమంలో కేటీఆర్ తోపాటు హరీష్ రావు, తదితర నేతలు పాల్గొన్నారు.

Next Story