- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KTR: సీఎం ఇలాకాలో బడి పిల్లల పస్తులు.. మధ్యాహ్న భోజనంపై కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

దిశ, డైనమిక్ బ్యూరో: మీ ఢిల్లీ బాసులు.. మీ గల్లీ దోస్తులు ఆకలి తీర్చడం కాదు రేవంత్ (CM Revanth Reddy).. ముందు (mid-day meal scheme) మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి పెట్టూ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రాష్ట్ర సీఎంకు సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. పేదల గూళ్లపై బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ, బడిపిల్లలకు బుక్కెడు బువ్వపెట్టడంలో లేదా? అని ప్రశ్నించారు. అమృత్ స్కీమ్‌ను అప్పనంగా బామ్మర్ది కి కట్టబెట్టడంలో ఉన్న తెలివి, బుక్కెడు బువ్వకు అలమటిస్తున్న పసి పిల్లల కడుపు నింపడంలో లేదా? అని నిలదీశారు. ఆదానికి రాష్ట్రంలోని వనరులు దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ, ప్రభుత్వ పాఠశాలల దీనస్థితిపై లేదా? అని ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళన పేరుతో మూటలు కట్టి ఢిల్లీకి కట్టలు పంపడంలో ఉన్న ప్రేమ, భవిష్యత్ భారతావని వారసులైన పసిపిల్లల ఆకలి కేకలపై లేదా? అని ప్రశ్నించారు. మంత్రుల సంగతి దేవుడెరుగు, ముఖ్యమంత్రి ఇలాకాలోనే బడి పిల్లల పస్తులు ఉన్నారని ఆరోపించారు. ఒక్క పూట ఫోటోలకు ఫోజులిచ్చి.. గప్పాలు కొట్టడం కాదని, నిత్యం గుప్పెడు అన్నం అందుతుందో లేదో సమీక్ష చేసి చూడాలని సూచించారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన అని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.