- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ విజన్ టీ వర్క్స్..సాంకేతిక శక్తిగా మారిన గొప్ప వేదిక
తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ పేరు టీ వర్క్స్ అని కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

తెలంగాణ విజన్ టీ వర్క్స్
- సాంకేతిక శక్తిగా మారిన గొప్ప వేదిక
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ పేరు టీ వర్క్స్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కేసీఆర్ ఆలోచనల్లో పుట్టి, యువత చేతుల్లో సాంకేతిక శక్తిగా మారిన గొప్ప వేదిక ఇది అని కొనియాడారు. స్టార్టప్‌లకు కేవలం మాటల ప్రోత్సాహం కాదని.. ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అత్యాధునిక టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం బీఆర్‌ఎస్ అని తెలిపారు. దేశం మొత్తం డ్రోన్లు, డిఫెన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో ఆ బీజం ఎన్నో ఏళ్ల క్రితమే నాటింది కేసీఆర్ నాయకత్వం అని పేర్కొన్నారు.
టీ వర్క్స్ ఒక భవనం కాదని.. తెలంగాణ యువత కలలకు రెక్కలు తొడిగిన ప్రయోగశాల అని తెలిపారు. మేక్ ఇన్ తెలంగాణ అనే ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్‌ను తీసుకొచ్చి, హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టిన దూరదృష్టి కేసీఆర్‌దే అని వెల్లడించారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న ఈ సంస్థ.. తెలంగాణ అభివృద్ధి ఎంత ముందుచూపుతో సాగిందో మరోసారి నిరూపిస్తున్నదని తెలిపారు.






