- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు బర్త్ డే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు !
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ( Nara Chandrababu Naidu ) పుట్టినరోజ

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ( Nara Chandrababu Naidu ) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణమాజీ మంత్రి , గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ). హైదరాబాద్ ( Hyderabad) అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తెలంగాణ భవన్ లో ( Telangana Bhavan) చేరికల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. హైదరాబాద్ కు ఐటి కంపెనీలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడుకు కృషి ఉందని వివరించారు. అలాంటి నాయకులు.. భవిష్యత్తులో మరింత మంది రావాలని కూడా వెల్లడించారు.
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy) అలాగే చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఇద్దరు మంచి పనులు చేశారని... కానీ రేవంత్ రెడ్డి మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ (KCR) ఆనవాళ్లు లేకుండా..రేవంత్ రెడ్డి చర్యలు చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చి... ఒక గ్యారెంటీ అమలు చేయకుండానే ప్రజలను మోసం చేస్తూ ముందుకు వెళుతుందని నిప్పులు జరిగారు కేటీఆర్.






