- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా చేయలేకపోతే ఎన్నికల నుంచి తప్పుకుంటారా? : సీఎంకు కేటీఆర్ కౌంటర్
ఎన్నికల సమయంలో.. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సమయంలో.. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని, అలా చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ కు ఆ మాట చెప్పే ధైర్యం ఉందా? అని సవాల్ చేశారు. ఆదివారం.. నగరంలోని క్లాసిక్ గార్డెన్లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ హైదరాబాద్ లో ప్రజల కోసం ఒక్క ఇల్లైనా కట్టారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసేది చెప్పరు.. చెప్పింది చేయరని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు రిబ్బన్ కట్ చేసి.. ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకుంటున్నారని యద్దేవా చేశారు.
కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి.. 6 వేల ఇళ్లు ఇస్తామని చెప్పారని.. ఇప్పటి వరకూ 6 ఇళ్లయినా కట్టారా? అని నిలదీశారు. దేశం మొత్తం కాంగ్రెస్ ను వదిలించుకుంటే.. తెలంగాణలో మాత్రం నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చిందని వాపోయారు. సీఎం కాకముందు రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామనడం వెనుక ఆంతర్యమేదో ఉందన్నారు. కేసీఆర్ హయాంలో తాము మేం 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చేది రైతు డిస్కం కాదని.. రైతును చంపే డిస్కం అని ఆరోపించారు. కేసీఆర్ అప్పుచేసి సంక్షేమ పథకాలు చేపట్టారని, రేవంత్ రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుబంధు లేదు కానీ.. రాహుల్ బంధు నడుస్తోందని విమర్శించారు.






