- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరిపైనా ACB విచారణ జరుగుతోంది.. CM రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ఏసీబీ(ACB) నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ(ACB) నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి సవాల్ విసురుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘మిస్టర్ రేవంత్ రెడ్డి.. మన ఇద్దిరిపైనా ఏసీబీ విచారణ జరుపుతోంది. ఇద్దరం లై డిటెక్టర్ టెస్టుకు వెళ్దాం.. దీనికి దీనికి మీరు సిద్ధమేనా?’ అని సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని నడపటం చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ తరహా నాటకాలు ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లాగా తాను తప్పించుకునే వ్యక్తిని కాదు.. తప్పకుండా ఏసీబీ విచారణకు హాజరు అవుతా.. అధికారులకు సహకరిస్తా అని కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రం దివాళా తీసిందని మీరు ప్రతిరోజూ మాట్లాడుతూ రాష్ట్ర పరువు తీయకండి.. ప్రజా ధనం వృథా చేయకండి. చేతగాకపోతే దిగిపోండి అని సీరియస్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం ఉదయం10 గంటలకు విచారణకు రావాలని శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ గతంలో ఒకసారి విచారించింది. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అప్పుడే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది.






