- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మలావత్ పూర్ణకు కేటీఆర్ ఫోన్.. విషయం ఇదే!
బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) గురువారం ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణ(Malavath Poorna)కు ఫోన్ చేసి మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) గురువారం ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణ(Malavath Poorna)కు ఫోన్ చేసి మాట్లాడారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిరిపుత్రికగా పేరు తెచ్చుకున్న మలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్ కన్నుమూయడంతో, కేటీఆర్ ఆమెను ఓదార్చారు. కేటీఆర్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీలో ఉన్నప్పటికీ, ఈ విషాద వార్త తెలుసుకుని వెంటనే నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, పాకాల గ్రామంలో ఉన్న పూర్ణకు కాల్ చేశారు. పూర్ణ తండ్రి మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పూర్ణకు ధైర్యం చెప్పిన కేటీఆర్, త్వరలోనే స్వయంగా వచ్చి ఆమె కుటుంబాన్ని కలవనున్నట్లు హామీ ఇచ్చారు.
కాగా.. మలావత్ పూర్ణ 13 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఏడు ఖండాలలోని అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ఏకైక భారతీయ మహిళగా నిలిచారు.






