బీజేపీ వెంటనే క్షమాపణలు చెప్పాలి..కేటీఆర్ సంచలన ట్వీట్

by Ajay Maddhiboyina |

బీజేపీ నాయ‌క‌త్వం క్ష‌మాప‌ణ చెప్పాలంటూ ప్ర‌ధాని మోడీకి కేటీఆర్ సూటి ప్ర‌శ్న‌లు వేశారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మాధ‌వ్ మంత్రి లోకేశ్‌కు ఇచ్చిన ఇండియా మ్యాప్‌లో తెలంగాణ చిత్రపటం లేకపోవడంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

బీజేపీ వెంటనే క్షమాపణలు చెప్పాలి..కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ‌, వెబ్ డెస్క్: బీజేపీ నాయ‌క‌త్వం క్ష‌మాప‌ణ చెప్పాలంటూ ప్ర‌ధాని మోడీకి కేటీఆర్ సూటి ప్ర‌శ్న‌లు వేశారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మాధ‌వ్ మంత్రి లోకేశ్‌కు ఇచ్చిన ఇండియా మ్యాప్‌లో తెలంగాణ చిత్రపటం లేకపోవడంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ చిత్రపటం నుండి తెలంగాణను తొలగించడంపై బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. తెలంగాణ అస్తిత్వాన్ని, భౌగోళిక గుర్తింపును గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా... అని మోడీని ప్రశ్నించారు. ఒకవేళ ఇది పొరపాటున జరిగి ఉంటే, తెలంగాణ ప్రజలను అపహాస్యం చేసినందుకు బీజేపీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story