KRMB Meeting: నేడు కేఆర్‌ఎంబీ సమావేశం.. ఆ అంశాలపైనే కీలక చర్చ

by Kema Shiva Kumar |

ఏపీ సర్కార్ కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఇటీవలే కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB)కి ఫిర్యాదు చేశారు.

KRMB Meeting: నేడు కేఆర్‌ఎంబీ సమావేశం.. ఆ అంశాలపైనే కీలక చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సర్కార్ కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఇటీవలే కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB)కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేఆర్‌ఎంబీ చైర్మన్‌ అతుల్‌ జైన్‌ (KRMB Chairman Atul Jain) అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం బోర్డు సమావేశం కానుంది. శ్రీశైలం (Srisailam), నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar) నుంచి నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తోందని, వెంటనే అడ్డుకోవాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీశైలం (Srisailam), నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar ప్రాజెక్టుల పరిధిలో 35 చోట్ల టెలిమెట్రీ (Telemetry) పరికరాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ (KRMB)ని కోరింది. అదేవిధంగా నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ వివాదంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు..

కృష్ణ (Krishna), గోదావరి (Godavari) జలాలను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra PradesH) తరలించుకుపోతున్నా.. తెలంగాణ సర్కార్ (Telangana Government) మొద్దు నిద్ర పోతోందని గురువారం మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 666 టీఎంసీలకు గానూ ఇప్పటికే 657 టీఎంసీలను వినియోగించుకుందని.. కానీ, తెలంగాణకు 343 టీఎంసీలకు గానూ 220 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడం ప్రభుత్వ అసమర్ధతేనని మండిపడ్డారు. ఇప్పటికైనా సర్కార్ కల్లు తెరిచి రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు నీటి విడుదలను వెంటనే బంద్ చేయించాలని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వంతో కలిసి కేఆర్ఎంబీ (KRMB) కార్యాలయం ఎదుట ధర్నాకు బీఆర్ఎస్ సిద్ధమని హరీశ్ రావు అన్నారు.

Next Story