- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం.. స్పెషల్ ఇన్సెంటివ్స్‌పై కీలక నిర్ణయం
by Kema Shiva Kumar |
హైదరాబాద్ (Hyderabad) జలసౌధలో చైర్మన్ అతుల్ జైన్ (Atul Jain) అధ్యక్షతన జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)20వ ప్రత్యేక సమావేశం కాసేపటి క్రితం ముగిసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) జలసౌధలో చైర్మన్ అతుల్ జైన్ (Atul Jain) అధ్యక్షతన జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)20వ ప్రత్యేక సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ భేటీలో కేఆర్ఎంబీలో ప్రస్తుతం పని చేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులకు గతంలో ఇచ్చిన ప్రత్యేక ఇన్సెంటివ్‌లకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలపై డిస్కస్ చేశారు. అనంతరం స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వరాదని.. ఉద్యోగుల నుంచి రికవరీ చేయకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Next Story






