- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీ హోదాకు మించి మాట్లాడుతున్నావ్.. కడియం వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌంటర్
కేసీఆర్ తెలంగాణకు ఎలా జాతిపిత అయ్యాడు? కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం కేపీ వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ తెలంగాణకు ఎలా జాతిపిత అయ్యాడు? కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం కేపీ వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం తన హోదాకు మించిన మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ ఎంతకాలం వాడుకుంటారని కడియం విమర్శిస్తున్నాడని.. నీలా కేసీఆర్ పార్టీలు మారలేదని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎప్పుడూ ఆత్మగౌరవం తాకట్టుపెట్టుకోలేదని పదవులకోసం పాకులాడలేదని అన్నారు.
తెలంగాణ సమాజం అంతటిని ఒకతాటిపైకి తీసుకువచ్చి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని చెప్పింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. ఆ రోజు దేవుడిగా ఉన్న కేసీఆర్ నీకు ఈ రోజు చిన్నగా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ బరాబర్ తెలంగాణ జాతిపిత అని వ్యాఖ్యానించారు. చిన్న పిల్లవాడి నుండి ముసలివాళ్ల వరకు కడుపులో పెట్టుకున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ వెనకనే ఉంటుందని చెప్పారు. అధికారం ఉంటే ఒకలా లేకపోతే మరొకలా ఉండదని అన్నారు.






