Konda Vishweshwar Reddy: గేటు బయటే తన్ని తరిమేస్తాం.. కేసీఆర్ ఫ్యామిలీ పాలిటిక్స్ పై బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

కవిత ఎపిసోడ్ అంతా ట్రాష్ అని, ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఆయనేనని బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Konda Vishweshwar Reddy: గేటు బయటే తన్ని తరిమేస్తాం.. కేసీఆర్ ఫ్యామిలీ పాలిటిక్స్ పై బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లేఖ డ్రామా ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాను అనుకున్నది సాధించిందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) తో తాజా పరిణామాల వెనుక ఉన్నది కేసీఆరేనని, ఫామ్ హౌస్ లో కూర్చుని ఇదంతా కేసీఆర్ చేస్తున్న ప్లాన్ అని ఆరోపించారు. కవిత (Kavitha) ఎపిసోడ్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొండా.. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ తగ్గుతుండటం వల్ల ఈ డ్రామా చేస్తున్నారని ఇదంతా ట్రాష్ అని అన్నారు. ఈ వ్యవహారం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడం, న్యూస్ హెడ్ లైన్స్ లో నిలవడంలో కవిత తాను అనుకున్నది సాధించిందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అంతా ప్రొఫెషనల్ పొలిటిషియన్స్ అని అవసరం అయితే కాళ్లు పట్టుకుంటారు లేకుంటే జుట్టుపట్టి తరిమేస్తారని హాట్ కామెంట్స్ చేశారు.

గేట్ వద్దే తన్ని తరిమేస్తాం:

బీఆర్ఎస్, బీజేపీ విలీనం, పొత్తు అంశంపై స్పందిస్తూ.. కేసీఆర్ కుటుంబసభ్యులు బీజేపీ దగ్గరికి వస్తే గేట్ వద్దే తన్ని తరిమేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఆరు నూరైనా కలవదన్నారు. రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయని కానీ కొన్ని మారవన్నారు. కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా ఎప్పటికి డ్రామాగానే మిగిలిపోతుందని ఇక ఎప్పటికీ ఆయన సక్సెస్ కాలేరన్నారు. కేసీఆర్ కు తన ఫ్యామిలీ (KCR Family) ఫస్ట్, పార్టీ సెకండ్ తెలంగాణ లాస్ట్ అని సెటైర్ వేశారు. నిజానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పొత్తు ఉందని మునుగోడు ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పని చేసి మాపై బురద జల్లారన్నారు. మేము కవితను అరెస్ట్ చేశామని మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ ను ఎవరినైనా అరెస్టు చేశారా అని ప్రశ్నించారు.

Next Story