- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
konda susmita : కొండా స్టోరీలో మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ! కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్‌టాపిక్
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ దంపతుల రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వారు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో/వరంగల్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ దంపతుల రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వారు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఈ సమయంలోనే కొండా స్టోరీలోకి మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చారు.‘నేనే ఎమ్మెల్యే అభ్యర్థి’ అంటూ కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె కొండా సుస్మితా పటేల్ (konda susmita patel) సర్‌ప్రైజ్ ఇచ్చారు. పరకాల టికెట్‌ని ఆశిస్తున్నానంటూ.. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ బయోను అప్డేట్ చేశారు. ఇప్పటికే కొండా దంపతుల కారణంగా.. వరంగల్ కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్న నేపథ్యంలో ఈ ఇన్‌స్టాగ్రామ్ అప్డేట్ మరింత చర్చానీయంశంగా మారింది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి మంత్రి కొండా సురేఖ దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుమంది ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయినిరాజేందర్ రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, వరంగల్ డీసీసీ అధ్యకురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితర కీలక నేతలకు కొండా ఫ్యామిలీకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బహిరంగంగా సవాళ్లు చేసుకునే పరిస్థితి వచ్చింది.
పరకాల నుంచి పోటీకి సిద్ధం!
ఇప్పుడు కొండా కుమార్తె ఎంట్రీతో.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మరింత అలజడి వాతావరణం పెరిగింది. ‘పరకాల అస్పరెంట్’ అంటూ పరకాల నుంచి పోటీకి సిద్ధం అని కొండా సుస్మిత ఇన్‌స్టా బయో సూచిస్తోంది. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కొండా సుస్మితా పటేల్.. ఫుల్ టైమ్ రాజకీయాల్లో అలర్ట్ ఉంటే ఎలా ఉంటుందోనని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై వరంగల్ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్టాండ్ తీసుకుంటారోనని రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






