- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో బీఆర్ఎస్ సినిమా ఓవర్ : రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రా

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ( Telangana) బీఆర్ఎస్ పార్టీ ( BRS) కథ ముగిసిపోయిందని... ఆ సినిమా ఓవర్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటు వేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపారని ఆరోపణలు చేశారు.
కాళేశ్వరం విషయంలో KTR మతిభ్రమించి మాట్లాడుతున్నారు, ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్చాలని చురకలు అంటించారు. ఇక అటు మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్టానంపై నమ్మకం ఉంది.. మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా అన్నారు. సుదర్శన్ రెడ్డి -రాజగోపాల్ రెడ్డిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవిపై నిర్ణయం మొత్తం కాంగ్రెస్ అధిష్టానందే అంటూ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ హై కమాండ్ ద్రుష్టి పెట్టింది.






