CM రేవంత్‌ను నేను విమర్శించలేదు.. మరోసారి MLA కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-15 17:21:01  IST  )

కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

CM రేవంత్‌ను నేను విమర్శించలేదు.. మరోసారి MLA కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని, కాంగ్రెస్ పార్టీని ఏనాడూ విమర్శించలేదని అన్నారు. నా మంత్రి పదవి అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నాకు పదవి వచ్చేటప్పుడు ఎవరూ ఆపలేరు. ఆపితే ఊరుకోను కూడా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదవి ఇవ్వకపోతే.. ఇవ్వలేదు.. కనీసం మునుగోడు(Munugodu) నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాతో పాటు నా నియోజకవర్గం మీద కూడా వివక్ష చూపిస్తున్నారు. ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మంత్రుల వద్దకు వందలసార్లు తిరిగినా బిల్లులు మంజూరు చేయడం లేదని అన్నారు. మంత్రులను అడిగితే సీఎం చేతిలో ఉందంటున్నారు.. పదవులు, నిధులు అన్నీ మీకేనా అని సీఎంను రాజగోపాల్ రెడ్డి అడిగారు.

Next Story