- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు స్టీరింగ్ పట్టిన మంత్రి కోమటిరెడ్డి..!
నల్లగొండలో శనివారం ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. నూతనంగా రాష్ట్ర రవాణా శాఖ కింద నల్లగొండ బస్ డిపోకు అందిన

దిశ, నల్లగొండ: నల్లగొండలో శనివారం ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. నూతనంగా రాష్ట్ర రవాణా శాఖ కింద నల్లగొండ బస్ డిపోకు అందిన ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటిపారుదల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనలోని నడకీ తలపించే యవ్వన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. బస్‌ను స్వయంగా స్టీరింగ్ పట్టి, డిపో నుండి మున్సిపల్ కార్యాలయం వరకు బస్సును నడిపారు. బస్సులో ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఉండగా, మంత్రి ఆత్మవిశ్వాసంతో బస్‌ను ముందుకు నడిపారు. ‘‘ప్రభుత్వమే నడుపుతున్నాం.. బస్ నడిపించలేమా?’’ అన్న ధీమాతో మంత్రి చూపించిన డ్రైవింగ్ చాతుర్యం అందరినీ ఆకట్టుకుంది.
తొలుత బస్సులో ఉన్నవారంతా కొద్దిగా ఉత్కంఠతో ఉన్నప్పటికీ, బస్‌ను సురక్షితంగా ఆపి దిగిన తరువాత హర్షాతిరేకం వ్యక్తమైంది. ప్రజాప్రతినిధుల మధ్య ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. మంత్రి చక్కగా బస్సును నడిపిన దృశ్యం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.






