- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : కోడేరు ఎస్సైని సస్పెండ్ చేయాలి : హరీష్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం నర్యానాయక్ తండా(Naryanayak Thanda)లో కాంగ్రెస్(Congrss) నాయకుల దాడికి గురైన బాధిత బీఆర్ఎస్(Brs) నాయకులను బెదిరించిన(Threatening) కోడేరు ఎస్సై(Coderu SI)ని సస్పెండ్ చేయాల(Suspend)ని మాజీ మంత్రి టి.హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం నర్యానాయక్ తండా(Naryanayak Thanda)లో కాంగ్రెస్(Congrss) నాయకుల దాడికి గురైన బాధిత బీఆర్ఎస్(Brs) నాయకులను బెదిరించిన(Threatening) కోడేరు ఎస్సై(Coderu SI)ని సస్పెండ్ చేయాల(Suspend)ని మాజీ మంత్రి టి.హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడి చికిత్స కోసం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే అక్కడ కూడా కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి, కారు ధ్వంసం చేశారని హరీష్ రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే దాడి చేసిన వారి వివరాలు బయటకు వస్తాయని ..అ సీసీ కెమెరాలు స్థానిక పోలీస్ స్టేషన్ కు అనుసంధానంగా ఉన్నాయని తెలిపారు. ఉదయం దాడి జరిగిన వెంటనే కోడేరు ఎస్సైకి ఫిర్యాదు చేస్తే తిరిగి బాధితుడినే బెదిరించారన్నారు. కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మారణాయుధాలతో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని, వాటిని వెంటనే బయట పెట్టాలన్నారు.
లేకుంటే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను బెదిరించిన కోడేరు ఎస్సైనిని సస్పెండ్ చేయకపోతే ఆందోళన చేపడుతామన్నారు.అంతకుముందు హరీష్ రావు నర్యానాయక్ తండా ఘటనను తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని...ఇలాంటి ఎన్నో అణచివేతలను ఎదుర్కొని నిలిచిందని..దాడులకు, కేసులకు మా కార్యకర్తలు భయపడరని..బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందన్నారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమ కర్తవ్యం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను ఉసిగొల్పుతూ నిజంగానే మార్పు తెచ్చారని.. కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీని ఆ పార్టీ కొల్లాపూర్ లో అమలు చేయిస్తోందని హరీష్ రావు విమర్శించారు.






