Kodandaram: కాంగ్రెస్ కు ఆనాడే చెప్పాము.. హామీలపై కోదండరాం ట్విస్ట్

by Prasad Jukanti |

కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై టీజేఎస్ చీఫ్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kodandaram: కాంగ్రెస్ కు ఆనాడే చెప్పాము.. హామీలపై కోదండరాం ట్విస్ట్
X

దిశ, డైనమిక్ బ్యుూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై టీజేఎస్ చైర్మన్ కోదండరాం (Kondadaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని అందువల్ల కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడాలని ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు (Congress) చెప్పామని హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు వాళ్ల పార్టీలో అంతర్గత చర్చ ఉంటుందని దాని ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారన్నారు. అధికారంలోకి వచ్చే ముందే అప్పులు ఉన్నాయని తెలుసని ప్రకటనలు చేసే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికలకు ముందు చెప్పామని ఇప్పుడు కూడా చెబుతున్నామన్నారు. తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు.

ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రైతుభరోసా, రేషన్ బియ్యం, పించన్లు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు. వీటిని అమలు చేశాక రాష్ట్రానికి ముగులుతున్న ఆర్థిక వనలురు చాలా పరిమితంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక రంగం పునర్వ్యవస్థీకరణ , ఆదాయం పెంపుపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అప్పులను నిష్ర్పయోజనం చేసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కారణం ఎవరు అనేది ఆలోచించాలని అలాగే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాం అనేది ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంటుందన్నారు. రాజకీయాల్లో భాషా చాలా ముఖ్యం అన్నారు. బనకచర్ల తెలంగాణకు చాలా అన్యాయం చేస్తుందని కేంద్ర సంస్థల నుంచి కీలక సమాచారం తీసుకుని చెబుతున్నామన్నారు. బనకచర్ల నిర్మిస్తే తెలంగాణ శాశ్వతంగా తన వాటా కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బనకచర్ల నిర్మాణం జరగకూడదన్నారు. ఈ ప్రాజెక్టు ఆపేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే కాదు బీజేపీపై కూడా గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉందన్నారు. తన ఎమ్మెల్సీ పదవి విషయం ఇంకా సుప్రీంకోర్టు పరిధిలో ఉందని అందువల్ల తాను స్పందించలేనన్నారు.

Next Story