- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు ఆ అవకాశం రాలేదు.. ఇప్పుడు రాజ్యసభ అడుగుతా.. రాజ్యసభ రేస్‍లోకి మరో సీనియర్ నేత
తెలంగాణలోరాజ్యసభ సీటు అంశం చర్చనీయాంశంగా మారింది. అవకాశం కోసం సీనియర్లు పోటీలో ఉండటంతో ఎవరికి చాన్స్ దక్కబోతోంది?

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల (Rajya Sabha) కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఆశావహులంతా ఒక్కొక్కరుగా తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. తాజాగా రాజ్యసభ చాన్స్ విషయంలో రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి (K. Kodand Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. గతంలో సౌత్ ఇండియాకు జాతీయ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్ష పోస్ట్ ఇవ్వాలని ఏఐసీసీని అడిగానని కానీ అనుకోని కారణాల వల్ల నాకు ఆ పోస్ట్ రాలేదన్నారు. నేను పార్టీ కోసం పనిచేశాను ఇంకా పనిచేస్తున్నాను. పార్టీ పరంగా రాజ్యసభ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ కావాలని సీఎం, పీసీసీ చీఫ్‍ను అడుగుతానని చెప్పారు. పార్టీకి నేను చేసిన సేవ సీఎంకు, పీసీసీకి తెలుసన్నారు. హై కమాండ్ దృష్టిలో కూడా నేను ఉంటానని, అర్హత ఉన్నవారికి పదవులు ఇవ్వాలన్నారు. రాజ్యసభ అవకాశం పార్టీలో కార్యకర్తకి ఇచ్చిన సంతోషమేనన్నారు. అయితే రాజ్యసభ అవకాశం కోసం తాను మాత్రం ఢిల్లీకి వెళ్లనన్నారు.
పోటీలో సీనియర్లు:
రెండు ఖాళీలో ఒక స్థానానికి అభిషేక్ మను సింఘ్వీ పేరు ఖరారైనట్లేనని ఇక రెండో స్థానం అవకాశంపైనే పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండో స్థానానికి సీఎం సలహాదారు వేం నరేంద్ రెడ్డి, వీహెచ్. మధుయాష్కీ గౌడ్, టి.జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, జెట్టి కుసుమకుమార్ వంటి నేతలు రేస్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా కోదండ రెడ్డి సైతం తన మనసులో ఉన్న మాట బయటపెట్టడంతో ఉన్న ఒక్క సీటులో అధిష్టానం ఎవరిని అకామిడేట్ చేయబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది. అభ్యర్థి ఎంపిక పార్టీకి చికాకుగా మారకుండా ఉండేందుకు పీసీసీ చీఫ్, కొందరు మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.






