- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్ పనులు పూర్తి ఎప్పుడంటే?
కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Komuravelli Mallanna Temple) కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లిలో నిర్మాణంలో ఉన్న కొత్త హాల్ట్ స్టేషన్ త్వరలో పూర్తికానుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) సోమవారం ఎక్స్ వేదికగా ఆనక్తికర పోస్ట్ చేశారు. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి త్వరలో రైలు కనెక్టివిటీ అంటూ రైల్వే స్టేషన్ వివరాలు పంచుకున్నారు. (Komuravelli Railway Halt Station) కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ పనుల స్థితి 95% పూర్తి అయ్యాయని ప్రకటించారు. ప్లాట్‌ఫామ్ షెల్టర్, హై లెవల్ ప్లాట్‌ఫామ్ పనులు పూర్తి అయినట్లు తెలిపారు. స్టేషన్ భవనం ఆర్కిటెక్చరల్ ఎలివేషన్ పనులు నడుస్తున్నట్లు తెలిపారు. ఈ స్టేషన్, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి వచ్చే భక్తులకు సులభమైన రైల్వే కనెక్టివిటీని కల్పించడంతో పాటు స్థానిక రవాణా సౌకర్యాలను కూడా పెంపొందిస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు, ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేయాలనే ప్రధాని మోడీ సంకల్పాన్ని చాటుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.






