- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCRను కాపాడేందుకు కిషన్‌రెడ్డి చూస్తుండు.. సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్
రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఢిల్లీ (Delhi)కి కాకపోతే.. ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఢిల్లీ (Delhi)కి కాకపోతే.. ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పదే పదే సీఎం ఢిల్లీకి వెళ్తున్నాడని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై ఆయన ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఇవాళ హస్తినలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయని అన్నారు. బనకచర్ల (Banakacharla)పై జలశక్తి సమావేశంలో ఏం జరిగిందో కేంద్రమే చెప్పిందని తెలిపారు. కేసీఆర్ (KCR)ను కాపాడేందుకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి (Kishan Reddy) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. అందుకే కాళేశ్వరం (Kaleshwaram)తో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐ (CBI)కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని బాంబు పేల్చారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వారి చెప్పుచేతల్లోనే ఉన్నాయి కాబట్టి.. పని సులువు అవుతుందనే భావనలో కిషన్ రెడ్డి ఉన్నారేమోనని కామెంట్ చేశారు. నారా లోకేశ్‌ను కేటీఆర్ (KTR) రహస్యంగా కలిశారని.. అర్ధరాత్రి పూట డిన్నర్ మీట్ పెట్టడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఇక కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లి కవితే ఒప్పుకోవడం లేదని.. ఆమెకు ఆమె ఇంట్లోనే విలువ లేదన్నారు. కొడుకు కేటీఆర్‌కు కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాను ఇవ్వడం లేదని.. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో లేక స్లీపింగ్ ప్రెసిండేంటో తనకు తెలియదని సెటైర్లు వేశారు. ముందు ఆయన కుటుంబం అంతా ఒక తాటిపైకి రావాలని.. ఆ తరువాల రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలని హితవు పలికారు. తనకు ఎవరితో ఎలాంటి శతృత్వాలు.. వైరుధ్యాలు లేవని.. కేసీఆర్ కేవలం తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని రేవంత్ అన్నారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచాణను వేగవంతం చేశామని, త్వరలోనే నిజాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. కేసులో విషయంలో తాను అనవసర హడావుడి చేయబోనని.. కానీ, కేంద్రం ఈ విషయంలో తలదూర్చుతూ అడ్డు పడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తాము అధికారంలోకి వచ్చాకే అరెస్టులు చేస్తున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.






