- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: ఆ సన్నాసుల గురించి పట్టించుకోకండి.. కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
టీ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం వేళ కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అధ్యక్షులుగా ఎవరు ఉన్నా బీజేపీ పార్టీకి (BJP) కార్యకర్తలే నిజమైన నాయకులు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. అధ్యక్షుడిగా నేను ఉన్నా మరొకరు ఉన్నా కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అన్నారు. 14 కోట్ల మంది సభ్యులు కలిగిన బీజేపీ పార్టీలో సభ్యత్వం కలిగి ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఎవరు అధ్యక్షులుగా ఉన్నా మనమంతా ఐక్యమత్యంతో అంకితభావంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేమి కిరీటాలు రావని బాధ్యతలన్ని అధ్యక్షుడిపైనే వదిలేసేది లేదన్నారు. ఇంత కాలం సమిష్టిగా పని చేశామని ఇకపై కూడా సమిష్టిగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ అసెంబ్లీపై కాషాయజెండా ఎగరవేయడమే ఏకైక లక్ష్యం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు (Ramachander Rao) ఎంపిక ప్రకటన కార్యక్రమంలో మాట్లాడిన కిషన్ రెడ్డి దేశ ప్రజలు, బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తోందని అన్నింటికి మించి తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోని గ్రామీణ ప్రజలు కమలం పువ్వు జెండా వైపు చూస్తున్నారన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ముందు మీ సంగతి చూసుకోండి:
బీజేపీపై విమర్శలు చేస్తున్న వారికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ (BRS) కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ (Congress) అంటుంటే, కాంగ్రెస్- బీఆర్ఎస్ కుమ్మక్కు అయిందని బీఆర్ఎస్ ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారు. కానీ మాకు ఎవరితోనూ కుమ్మక్కు అయ్యే అవసరం లేదు. మేము కుమ్మక్కు అయ్యేది తెలంగాణ ప్రజలతో మాత్రమేనన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎవరి దయాదాక్షిణ్యాలతో మేము గెలవలేదు. మా కార్యకర్తల కష్టం, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మాత్రమే గెలిచాం. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తామన్నారు. బీజేపీపై అర్థం పర్థం లేకుండా రన్నింగ్ కామెంట్స్ చేస్తున్న సన్నాసులకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదని, సమాధానం చెప్పుకునే అవసరం ఎవరికైనా ఉంది అంటే అది నా తెలంగాణ ప్రజలకు మాత్రమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అండగా నిలిచి వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మా పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉండాలో మా పార్టీ, మా కార్యకర్తలు నిర్ణయిస్తారు. కానీ మా పార్టీ అధ్యక్షుడి నియామకంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. మా ముందు మీ పార్టీల సంగతి చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కాళ్ల కింద భూమి కదులుతోందన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారు ఇప్పుడు పోటీ పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్న వాళ్లు బీజేపీకి అధ్యక్షుడు ఎవరు ఉండాలో చెప్తారా? మాకు నీతి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు.
కాషాయజెండా ఎగరడమే ఏకైక లక్ష్యం:
ఈ రాష్ట్రాన్ని గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ పరిపాలిస్తే గత 18 నెలలుగా కాంగ్రెస్ పరిపాలిస్తోంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నవారేనన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ బూత్ కు వచ్చిన 100 మందిలో 37 మంది నరేంద్ర మోడీని బీజేపీని ఆశీర్వదించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు బీజేపీ అభ్యర్థులు విజయఖేతనం ఎగరవేశారన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీలోని మనమంతా ఐక్యమతంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు మనమంతా సమిష్టిగా ముందుకు వెళ్లామని ఇకపై రామచందర్ రావు నాయకత్వంలోనూ కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ శాసనసభపై కాషాయజెండా ఎగరడమే ఏకైక లక్ష్యం అన్నారు. ఈ రాష్ట్రంలోని సమస్యలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణం అన్నారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?:
కొంత మంది సన్నాసులు బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రతిరోజు మాట్లాడుతున్నారు. గత 11 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సుమారు 11 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేసిందన్నారు. అనేక సంస్థలు తెలంగాణకు తీసుకువచ్చామన్నారు. ఈ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరణకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపటామన్నారు. గడిచిన 11 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై చర్చకు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి చర్చకు సిద్ధం అన్నారు. సెక్రటేరియట్ కు రమ్మంటారా? వరంగల్ గడ్డమీదకు రమ్మంటారా? ప్రెస్ క్లస్, ట్యాంక్ బండ్, కరీంనగర్ కైనా వస్తామన్నారు. బహిరంగంగా చర్చిద్దామని సవాల్ విసిరారు. ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు బీజేపీపై మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉండగా ప్రతిరోజు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని సాయంత్రం కాగానే ఇవాళ ఏమొచ్చిందని కాంగ్రెస్ లెక్కలు చూసుకుంటోందన్నారు. అలాంటి మీరు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా నరేంద్ర మోడీ పాలనపై మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More... బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఏకగ్రీవంగా.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్






