కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే రాజీవ్​గృహకల్ప సమస్యలకు పరిష్కారం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

by Disha Web Desk 20 |
కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే రాజీవ్​గృహకల్ప సమస్యలకు పరిష్కారం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
X

దిశ, ఖమ్మం రూరల్​ : వైఎస్​ఆర్​ హాయంలో నిర్మించిన రాజీవ్​గృహకల్ప ఇండ్లకు అనాటి నుంచి నేటి వరకు ఎటువంటి మరమ్మత్తులకు కానీ, మౌలిక వసతులు కల్పించడంలో బీఆర్​ఎస్​ ఘోరంగా విఫలమైందని, కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సొమవారం రూరల్​ మండలం రాజీవ్​గృహకల్ప కాలనీలో కాలనీవాసులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం అంతా వెనుక బడ్డ ప్రాంతమని ఎమ్మెల్యే నిర్లక్ష్యం వలనే ఈ ప్రాంతం వెనుకబడిందన్నారు. ఎప్పుడో కట్టిన ఇళ్లు రిపేరు చేయించక పోతే అందులో ప్రజలు ఎలా నివసిస్తారని ప్రశ్నిస్తున్నారు.

మున్నేరు వాల్ జీవో ఇచ్చాము.. కడతాము అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల సమస్యకు అధికారంలోకి రాగానే కనుగొని పరిష్కరిస్తామన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఎన్ని ఇళ్ళు నిర్మించారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని, గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మీ శ్రీనన్న గుర్తు హస్తం గుర్తు పై ఓటేసి భారీ మోజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వర్​రావు, ధరావత్​ రామ్మూర్తినాయక్​, మద్ది మల్లారెడ్డి, బత్తుల కుర్మారావు, కొర్లకుంట్ల శ్రీనివాసరావు, టీసీవీ రెడ్డి, పీఎస్ఆర్​ యూత్​ మహేష్​ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed