- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాద్రిలో ప్రారంభమైన వినాయక నిమజ్జనాలు
భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పవిత్ర గోదావరి నదిలో వినాయక నిమజ్జనాలు ప్రారంభం అయ్యాయి. వినాయక చవితి రోజు వివిధ

దిశ, భద్రాచలం: భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పవిత్ర గోదావరి నదిలో వినాయక నిమజ్జనాలు ప్రారంభం అయ్యాయి. వినాయక చవితి రోజు వివిధ మండపాలలో కొలువుతీరిన గణనాధులు భక్తుల నుండి పూజలు అందుకుని గంగమ్మ ఒడికి సాగనంపేందుకు ఆంధ్ర, తెలంగాణా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల లోని వివిధ ప్రాంతాల నుండి భద్రాద్రికి భక్తులు గణనాధులను తీసుకుని వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంచిలలో గోదావరి మధ్యకు తీసుకుని వెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. పోలీస్, రెవిన్యూ అధికారులు నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కాగా తొమ్మిదవ రోజు 3 వేలు విగ్రహాలకు పైగా భద్రాద్రికి తరలివచ్చే అవకాశం ఉండటంతో, ట్రాఫిక్ కి ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.






