గిరిజన విద్యార్థి మృతి.. ఆసుపత్రి ముందు ఉద్రిక్తత

by Kodari Anjali |

గిరిజన విద్యార్థి ఆసుపత్రిలో మృతి చెందడంతో.. ఆసుపత్రి ముందు కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు.

గిరిజన విద్యార్థి మృతి.. ఆసుపత్రి ముందు ఉద్రిక్తత
X

దిశ, భద్రాచలం: విలీన మండలాలకు చెందిన అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం, కొండిబ గ్రామానికి చెందిన కొర్ర సాంజు (13) అనే విద్యార్థి మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో సమీపంలోని ఎస్.కోట ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో కొద్ది సేపటికే విద్యార్థి మృతి చెందాడు .మృతుడు చిలకలగెడ్డ జీటిడబ్ల్యూ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయాన్ని తమకు ముందుగా తెలియజేయలేదని, మరణించిన తర్వాత మాత్రమే సమాచారం అందించారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎస్.కోట ఆసుపత్రి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విద్యార్థి మృతికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story