- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime News ఖమ్మంలో మరో సూది మందు హత్య..! భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి..
ఖమ్మం జిల్లాలో మరో సూది మంది హత్య వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం చింతకాని మండలంలో కలకలం రేపిన హత్యను మరవక ముందే అదే తరహలో

దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాలో మరో సూది మంది హత్య వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం చింతకాని మండలంలో కలకలం రేపిన హత్యను మరవక ముందే అదే తరహలో జరిగిన మరో మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భిక్షం అనే వ్యక్తి తన రెండో భార్యను హత్య చేసేందుకు ఈ ప్లాన్ అమలు చేశాడు. ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి డెలివరీ కోసం రెండో భార్యను తీసుకెళ్లిన భిక్షం.. సెలైన్ బాటిల్‌లో పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆమె మృతి చెందింది.
అయితే నేరం తన మీదికి రాకుండా ఉండేందుకు భర్త మరో కన్నింగ్ ప్లాన్ అమలు చేశాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని ఆందోళనకు దిగాడు. అనుమానం వచ్చిన ఆస్పత్రి యజమాన్యం సీసీ ఫుటేజీని పరిశీలించగా.. భర్త కుట్ర బయటపడింది. వెంటనే దీనిపై డాక్టర్లు ఖమ్మం టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ హత్యపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఖమ్మం జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే సూది మందు హత్యలు జరగడంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
- Tags
- Crime News Today






