సర్పంచ్ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్

by Bhanu |

కారేపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి పోలగాని శ్రీనివాస్ గౌడ్‌కు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

సర్పంచ్ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్
X

దిశ, కారేపల్లి రూరల్: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలోని ఒక గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సింగరేణి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పోలగాని శ్రీనివాస్ గౌడ్‌ను గెలిపించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి షేక్ గౌసుద్దీన్ సర్పంచ్ ఎన్నికల పోటీ నుండి తప్పుకోవాలని తెలిపారు. ఇరువురు ఏకాభిప్రాయంతో మదన్ లాల్ సానుభూతిపరులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ ఎన్నికల్లో పోలగాని శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల గుర్తు స్పానర్‌పై ఓటు వేసి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని తీర్మానం చేసుకున్నారు.

Next Story