- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకుల ప్రవేశ పరీక్షా ఫలితాలలో విద్యార్థుల ప్రతిభ
తూతక లింగన్నపేట గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల విద్యాలయాలలో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలలో తమ ప్రతిభను కనబరిచారు.

దిశ, ఏన్కూరు : మండల పరిధిలోని తూతక లింగన్నపేట గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల విద్యాలయాలలో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలలో తమ ప్రతిభను కనబరిచారు. టీఎల్ పేట, అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 11 మంది విద్యార్థులూ వివిధ గురుకుల విద్యాలయాలలో సీట్లు సాధించారు. ఏన్కూరు, వైరా (బాలికలు), వైరా (బాలురు), అన్నపురెడ్డిపల్లి గురుకుల విద్యాలయాలలో సీట్లు పొందారు. వీరందరూ టి.ఎల్. పేట గ్రామంలోని జుజ్జూరి కృష్ణమాచారి వద్ద శిక్షణ పొందారు. ఎన్నో ఏళ్లుగా ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు అత్యధిక ఫలితాలు సాధిస్తూ జిల్లాలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గత ఏడాది బాలికల విభాగంలో జిల్లా ప్రథమ స్థానం సాధించిన విషయం తెలిసిందే. సీట్లు సాధించిన విద్యార్థులను ట్యూషన్ మాస్టర్ కృష్ణమాచారి (సీనియర్ రిపోర్టర్)ను గ్రామస్తులు అభినందించారు.






